Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో ప్రజా ప్రజాప్రతినిధులు స్పష్టం
నవతెలంగాణ-కొత్తగూడెం
రాజకీయ లబ్దికోసం వనమా కుటుంబంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, వారికి, వారి కుటుంబానికి నియోజక వర్గంలోని ప్రజా ప్రతినిధులు అండగా ఉంటామని, వనమా కుటుంబాన్ని కాపాడు కుంటామని నియోజక వర్గంలోని వివిధ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం చుంచుపల్లి మండలంలోని కమ్మవారి సేవ సత్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఇతర ప్రజా ప్రతినిధులు మాట్లాడారు. కొత్తగూడెం నిరయోజక వర్గం ప్రజలకు వనమా కుటుంబం ఏమిటో తెసునని చెప్పారు. రాజకీయలబ్దికోసం వారి కుటంబం మీద బురద చల్లాని చేస్తున్న ప్రయత్నా మానుకోవాలని సూచించారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వనమా కుటుంబం మద్దతుగా కొత్తగూడెం నియోజకవర్గంలోని 300 వందల మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో డీసీఎం ఎస్ వైస్ చైర్మన్ కోత్వల శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ భూక్యా సోనా, పాల్వంచ ఎంపీపీ సరస్వతి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, జెడ్పిటిసి బరపటి వాసు, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.