Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-కొణిజర్ల(ఏన్కూర్)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ(ఎం) జన్నారం గ్రామ శాఖ 11వ మహాసభ స్వర్ణ శ్రీదేవి నగర్లో అడపా రామారావు అధ్యక్షత జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక చర్యలుకు పాల్పడుతుందని, పార్లమెంట్ సమావేశాల్లో రైతు చట్టాలపై కనీసం చర్చించకుండా అంగబలం, అధికార బలంతో సమావేశంలో అనుకూల చట్టాలు చేసుకుంటూ సభ సాగనివ్వడం లేదంటూ విపక్షాలపై కుట్ర చేస్తున్నారని, తక్షణమే రైతు చట్టాలను ,విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. మహసభ ప్రారంభ సూచికగా జెండా పోతినేని సుదర్శన్ ఆవిష్కరణ చేశారు.
పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జీ భూక్య వీరభద్రం, జిల్లా నేత బొంతు రాంబాబు మాట్లడుతూ జన్నారం గ్రామంలో దళిత కాలనీలో, బీసీ వాడల్లో పేదలకు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవని వర్షానికి ఇండ్లు కురుస్తున్నాయి. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే జన్నారం గ్రామ ప్రజలకు ఇండ్లు మంజూరు చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం అని తెలిపారు. మహసభ నూతన కార్యదర్శిగా చింతల వెంకటేశ్వర్లు ఎన్నికైయారు.మహసభ ముందు అమరులకు సంతాపం తెలియజేశారు. ఈ మహసభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, సిపిఎం మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, మండల సీనియర్ నాయకులు బాణోత్ బాలాజీ, మండల నాయకులు ఏర్పంల రాములు, లెనిన్, ఎన్కూర్ సోసైటి వైస్ చైర్మన్ రేగళ్ళ తిరుమల రావు, మండల కమిటీ సభ్యులు స్వర్ణ కృష్ణారావు పాల్గొన్నారు.