Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెకెలో మెగా హరితాహారం కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు
- సహకరిస్తాం : ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ కోరం
- పర్యావరణ పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం కలెక్టర్
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియాలలో ఓసీల వెలికితీతకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని సింగరేణి డైరెక్టర్లు జెకెలో మెగా హరితాహారం కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు (ఆపరేషన్స్) యస్.చంద్రశేఖర్, (ఫైనాన్స్/పా /పి.పి) ఎన్.బలరాం, ఏరియా జీఎం మల్లెల సుబ్బారావులు అన్నారు. జేకేఓసీ ఓబీ డంప్ ఆవరణలో తెలంగాణకు హరితాహారం సింగరేణి ఆధ్వర్యంలో 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా గురువారం మెగా హరితాహారం కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్, జడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్, డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్/పా/పి.పి) ఎన్.బలరాం, ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు హాజరైయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ సింగరేణికి పుట్టినిల్లు అయిన ఇల్లందు ఏరియాలో నూతన బొగ్గు బావులు తీయుటకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలన్నారు. తద్వారా ఇల్లందు ఏరియాకు పూర్వవైభవం వస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సింగరేణికి పుట్టినిల్లు అయిన ఇల్లందు పేరు చిరస్థాయిగా ఉండటానికి మా వంతు సహకారం అందిస్తామని అన్నారు. అలా గే సింగరేణి, మున్సిపల్ శాఖా అధ్వర్యంలో పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు. జడ్పీ చైర్మెన్ మాట్లా డారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో పర్యావరణాన్ని కాపాడటం కోసం మున్సిపల్ శాఖా, సింగరేణి సంయుక్తంగా చెట్లను నాటడం వలన పచ్చదనంతో శోబిల్లుతోందని ఇల్లందు ఏరియా ఉన్నన్ని రోజులు సింగరేణి ఉంటుందని దానికి గాను ప్రజలు, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పరం సహకరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు.
అనంతరం మెగా హరితాహారం కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడాలని సింగరేణి పర్యావరణ అధి కారి పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. తరు వాత జెకేఒసి. ఓబీ డంప్ ఆవరణలో రెండు వేల మొక్కలను నాటే కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారు లు మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.