Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
పట్టణంలో కరెంట్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందని, అప్రకటిత కరెంట్ కోత ఎత్తి వేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు యం.బి. నరసారెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జగదీష్ కాలనీ శాఖ మహాసభ నాగమణి అధ్యక్షతన గురువారం జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు పార్టీ పతాకాన్ని జిల్లా కమిటీ సభ్యులు నర్సారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణంలో కరెంటు కోత విపరీతమైందని, గంటలు, పూటలు దాటిపోతోందని అన్నారు. తక్షణమే కరెంటు కోతలు ఎత్తివేసే దానికి ఉన్నతస్థాయి అధికారులు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభలు పార్టీ పట్టణ కమిటీ సభ్యులు అంబోజి రత్నం, పార్టీ సభ్యులు జోగారావు, దిలీప్ కుమార్, సౌభాగ్యం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జగదీష్ కాలనీ శాఖ నూతన కార్యదర్శిగా వై.నాగమణి ఎన్నిక
పట్టణంలోని జగదీష్ కాలనీ సీపీఐ(ఎం) శాఖ నూతన కార్యదర్శిగా యర్నాగుల నాగమణిని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యలపై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.