Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు రాష్ట్ర స్థాయిలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులో గోల్డ్ మెడల్కి ఎంపికయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి ఒక్కరికి ఐఏఎఫ్ఏఎస్ అధికారి కె.వి.ఎస్ బాబు మెమోరియల్ పేరిట గోల్డ్ మెడల్ ఇస్తుంది. ఈ మెడల్కి రాష్ట్ర స్థాయిలో శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఎవరికి తల వంగకుండా అటవీ సంపద కాపాడటంతో పాటు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దినందుకు ఈ మెడల్ అందజేస్తారని అటవీ శాఖ అధికారుల తెలిపారు.