Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్తీర్ణం సరిపడా మొక్కలు ఇవ్వండి
- ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులకు రైతుల వినతి
నవతెలంగాణ-అశ్వారావుపేట
పామ్ ఆయిల్ గెలలు రవాణా చార్జీలు పెంచాలని, విస్తీర్ణం సరిపడా పామ్ ఆయిల్ మొక్కలు పరిమితి పెంపుదలకు అనుమతి ఇవ్వాలని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల క్రిష్ణా రెడ్డి, ఎం.డి సురేందర్, ఉద్యాన శాఖ జేడీ సరోజిని దేవిలకు హైద్రాబాద్‌లో గల పరిశ్రమల భవన్‌లోని ఆయిల్ ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాంచంద్ర ప్రసాద్, వెంకటేశ్వర రావులు వినతి పత్రం అందజేసారు. సాగుకు అవసరం అయ్యే ఎరువులు, ఉపకరణాలను రాయితీపై అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి, రైతు సంఘం నాయకులు మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డిలు ఉన్నారు.