Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో నూతనంగా పునర్నిర్మాణం చేసిన శ్రీ మలినాధ మహా నాగ శివాలయం ప్రారంభోత్సవం సోమవారం వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు ఎలమంచిలి ప్రసాద్ శర్మ , బ్రహ్మాజీ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రతిరోజు వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ ప్రారంభో త్సవం, బొడ్రాయి ప్రతిష్ట నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు జోరున వర్షం కురుస్తూనే ఉంది. ఈ జోరు వర్షంలోనే శివాలయ ప్రారంభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య వేద పండితులు నిర్వహించారు. జోరున వర్షం కురుస్తున్నా చొప్పకట్లపాలెం గ్రామంలోనే వీధులు మొత్తం ప్రజలతో, భక్తులతో కిక్కిరిసిపోయింది. శివాలయ పునర్నర్మాణానికి సహకరించిన అనేకమంది దాతలు హాజరయ్యారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు, భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు.
పూజలు నిర్వహించిన మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులు
మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో శ్రీమలినాథ మహా నాగ శివాలయం సోమవారం వేద పండితుల నడుమ అట్టహాసంగా ప్రతిష్ఠా మహౌత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్లు హాజరై వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.