Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా కట్టాల్సిందేనని మండల పంచాయతీ అధికారి పి సూర్యనారాయణ స్పష్టం చేశారు. ముదిగొండ పంచాయతీలో సోమవారం మాస్కులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టలేదని, ముదిగొండకు వివిధ పనుల మీద వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి రావాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మాస్కు ధరించని ఇద్దరుకు ఆయన వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. కార్యక్రమంలో ముదిగొండ పంచాయతీ కార్యదర్శి పి సంపత్ సిబ్బంది పాల్గొన్నారు.