Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం లీగల్
చెల్లని చెక్కు కేసులో నిందితుడు కూసుమంచి గ్రామానికి చెందిన వి.వెంకన్నకు 4నెలలు జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ.2,55,000/లను చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్. కె.భూపతి సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఫిర్యాది కూసుమంచి గ్రామానికి చెందిన టి. లచ్చిరామ్ దగ్గర నిందితుడు రూ.2,55,000/లను తన కుటుంబ అవసరాల కోసం అప్పుగా తీసుకున్నాడు. ఫిర్యాది తన డబ్బులు తిరిగి చెల్లించమని అడగగా నిందితుడు ఫిర్యాదికి ది.15-10-2015న రెండు చెక్కులు జారిచేసినాడు. అట్టి చెక్కులను ఫిర్యాది తన బ్యాంకు ఖాతాలో జమ చేయగా అట్టి ఖాతాలో సరిపడ డబ్బులు లేకపోవడంతో ఆ చెక్కు నిరాధారణకు గురి అయింది. ఫిర్యాది తన న్యాయవాది ఎం.అశోక్ కుమార్ ద్వారా ఖమ్మం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేయగా అట్టి కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 4 నెలల జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి 2,55,000/లను చెల్లించాలని తీర్పు చెప్పారు. అట్టి తీర్పుపై నిందితుడు జిల్లా కోర్టులో అప్పీలు చేసుకోగా అట్టి అప్పీలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిందితుడికి 4 నెలలు జైలు శిక్ష తో పాటు పిర్యాది కి 2,55,000/లను చెల్లించావని సోమవారం తీర్పు చెప్పారు.
మాస్క్ ధరించని వారికి జరిమానాలు
నవతెలంగాణ-కల్లూరు
కరోనా అరికట్టడానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మాస్క్ ధరించిన వారికి జరిమానా విధించారు. కరోనాను అరికట్టేందుకు ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ ఆదేశాల మేరకు సోమవారం పట్టణ సెంటర్లో మాస్కో లేకుండా ద్విచక్రవాహనాలపైనా తిరుగుతున్నవారికి సుమారు పదిహేను మందికి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్వేత, ఎంపీఈవో వీరస్వామి, కల్లూరు ఈవో కృష్ణారావు, కార్యదర్శులు శ్రీనివాసరావు, రాజశేఖరరెడ్డి గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.