Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎన్డీ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు భూమికి పట్టాలు ఇవ్వమని అడగడమే నేరం అయినట్లు తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం న్యూడెమోక్రసి కార్యకర్తలు, నాయకులను అరెస్ట్లు చేయడం అప్రజా స్వామికమని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎన్డీ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజలపై ఫారెస్ట్, పోలీస్ అదికారులు కలిసి దాడులు చేస్తూ భయభ్రాంతులు సృష్టించమే కాక తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పోడుసమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏండ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆరోపించారు. ఇచ్చిన హామి అమలు చేయమంటే అక్రమ అరెస్ట్ లకుపాల్పడడం దుర్మార్గమన్నారు. కొత్తగూడెంలో డివిజన్ నాయకులు యన్.సంజీవ్, పార్టీ పట్టణ కార్యదర్శి.పి.సతీష్, పీవైఎల్ డివిజన్ నాయకులు సమ్మయ్య తదితరులను, పాల్వంచలో యన్. రాంబాబును జిల్లాలో, రాష్ట్రంలో అనేకచోట్ల అనేక మందిని పోలీసులు అర్ద రాత్రి నుండే ఇండ్లపై దాడులు చేసి అక్రమ అరెస్టులు చేశారని తెలిపారు. ఎన్ని దాడులు చేసినా, కేసులు పెట్టినా, పోడుసమస్య పరిష్కరించకపోతే పోరాటాలు ఉదృతమవుతాయని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన వారిని భేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
ఇల్లందు ఎన్డీ ఆధ్వర్యంలో పోడు భూముల సాగు దారులపై, అక్రమ కేసులు నిలుపుదల చేయాలని పోడు రైతులపై దాడులు, దౌర్జన్యాలు, పీడీయాక్ట్, ఆక్రమ కేసులను ఎత్తివేయాలని, ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలు, మంత్రుల, ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ క్యాంప్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో రాష్ట్ర నాయకులు అవునూరి మధు, జిల్లా నాయకులు, ప్రకాష్, నాగేశ్వరరావు, ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి కొక్కు సారంగపాణిచ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర నాయకులు అవునూరి మధు మాట్లాడారు.