Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎస్ఏంసీ చైర్మన్ రాజశేఖర్ వర్సెస్ హెచ్ఎం శోభారాణి
- ఈ ఉపాధ్యాయులు మాకొద్దు అంటున్న గ్రామస్తులు
నవతెలంగాణ-బోనకల్
సాక్షాత్తు స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జండా ఆవిష్కరణ సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు వ్యవహరించిన తీరుపై ఎస్ఎంసి కమిటీ చైర్మన్, గ్రామస్తుల మధ్య తీవ్ర వివాదం సంచలనంగా మారింది. జాతీయ జెండాను ఎంతో గౌరవంగా ఆవిష్కరించవలసిన సమయంలో ఈ వివాదం చోటు చేసుకోవటం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని కలకోట ప్రాథమిక పాఠశాల (హరిజనవాడ)లో ఆదివారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చోటు చేసుకుంది.
గ్రామ సర్పంచ్ ఎంగల దయామణి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు సంవత్సరాల నుంచి హరిజనవాడ ప్రాథమిక పాఠశాల వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఉపాధ్యాయులు నాగరాజు జట్టుగా ఉండి మిగతా ఉపాధ్యాయనీలను వేరుచేయడం, ఎస్ఏంసి చైర్మన్కు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో కోఆర్డినేషన్ లేకపోవడం తనకు తానే సొంత నిర్ణయాలు తీసుకోవడంతో వివాదాలుగా మారుతున్నాయి. ఎస్ఎంసి సభ్యులు, స్థానిక పెద్దలు, కాంప్లెక్స్ హెచ్ఎం సర్పంచ్ గతంలో పలుమార్లు చెప్పినప్పటికి ప్రధానోపాధ్యాయురాలు తీరు మార్చుకోకుండా నేనింతే నన్నెవరూ ఏమి చేయలేరంటూ పాఠశాల కార్యనిర్వహణలో విఫలమవుతున్నారు. క్రమంగా ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం కుంటువడి విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హెచ్ఎం శోభారాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తరువాత విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేయకుండా, జాతీయ నాయకుల ఫొటోలకు నివాళులు అర్పించకుండా, కనీసం పూలు కూడా వేయకుండా, కొబ్బరికాయలు కూడా కొట్టకుండా వేడుక అయిపొయిందని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ ఎంగల దయామని కాంప్లెక్స్ హెచ్ఏం, ఎస్ఏంసి చైర్మన్ తోటపల్లి రాజశేఖర్ గ్రామస్తులు ప్రధానోపాధ్యాయురాలు తీరుపై తీవ్ర అసహనానికి గురియ్యారు. హెచ్ఎం తీరుపై ఎస్ఎంసి చైర్మన్ రాజశేఖర్ ఇదేమి పద్ధతి అని హెచ్ఎంని ప్రశ్నించడంతో వివాదం రగులుకోంది. ఇంకోసారీ చేద్దాం ఇప్పుడు ఇంతే అని హెచ్ఎం అన్నారు. గతంలో కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఎవరూ లేకుండానే జాతీయ జెండా ఎగురవేసి వెళ్లిపోయారని, మీకు ఇది మంచి పద్ధతి కాదని ఆయన మందలించారు. ఉపాధ్యాయునుల పట్ల విభేదాలతో గతంలో కొట్టుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లారని, మరల అదే పరిస్థితి తీసుకువస్తున్నారని గ్రామస్తులు మందలించారు.
ఎస్ఎంసి చైర్మన్ తోటపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో కూడా శోభారాణి పతాకావిష్కరణ ఏకపక్షంగా చేసుకొని పోవడం విద్యార్థులకు మిఠాయిలు పంచుకోవడం జాతీయ నాయకులకు పూలమాలతో నివాళులర్పించక పోవడం, ఉపాధ్యాయులు నాగరాజు, కాంప్లెక్స్ హెచ్ ఏం అనుమతి లేకుండా సెలవులు తీసుకోని రానిరోజు కూడా హాజరు వేసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయాలపై పలుమార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఏ విధంగా వ్యవహరిస్తున్నారని. ఇప్పటికైనా అధికారులు హెచ్ఎం శోభారాణి, వివాదాలకు కారణం అవుతున్న ఉపాధ్యాయులపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యార్థులకు విద్యాబోధనలో చేయవలసిన ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలలో వివాదాలు పెట్టుకోవటం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని, ఈ ఉపాధ్యాయులు మాకొద్దు అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ వివాద సమయంలో అక్కడే సర్పంచ్ యంగల దయామణి, ఎంపీటీసీ యంగల మార్తమ్మ, ఎస్ఏంసి చైర్మన్ తోటపల్లి రాజశేఖర్, కాంప్లెక్స్ హెచ్ఏం సునీత, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, మాజీ ఎంపీటీసీ తోటపల్లి సాల్మన్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.