Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన ములకనాపల్లి గొత్తి కోయల గిరిజన గ్రామాన్ని హైదరాబాద్‌కు చెందిన గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర బృందం మంగవారం సందర్శించింది. ఏజెన్సీలో గిరిజన మరణాలపై జాతీయ హక్కుల కమీషన్ ఫిర్యాదు మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిష్టినా జగ్ చోంగ్తు ఆదేశాల మేరకు రాష్ట్ర బృందం గ్రామంలో పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. గ్రామంలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, చత్తీష్‌ఘడ్ నుండి ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు, కోవిడ్ 19 సమయంలో ఏమైనా కరోనా మరణాలు సంభవించాయా, వైద్య సిబ్బంది గ్రామంలోకి వస్తున్నారా, ఎంత మందికి రేషన్ కార్డులు ఉన్నాయి, వీటిలో అంత్యోదయ కార్డులు ఎన్ని, ఆసరా ఫించన్లు తీసుకుంటున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మీకు ప్రభుత్వం నుండి ఏమి కావాలి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. తాము 30 ఏళ్ల క్రితం ఇక్కడకు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకుని జీవనం సాగిస్తున్నామని, తాము పోడు వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, గ్రామంలో 10 కుటుంబాలకు రేషన్ కార్డులు రావాలని, కొంత మందికి ఫించన్లు వస్తున్నాయని, 57 ఏళ్లు దాటిన వారు ఏడుగురు ఉన్నారని, రెండేళ్లల్లో మరణాలు సంభవించ లేదని, పండించిన పంటలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నామని తెలపడంతో పాటు గ్రామానికి రహదారి సౌకర్యంతో పాటు పోడు భూములకు హక్కులు కల్పించాలని బృందం దృష్టికి తీసుకు పోయారు. గ్రామంలో మంచి నీటి సౌకర్యం, తదితర మౌళిక వసతులు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. పర్యటించిన వారిలో రాష్ట్ర బృందం సభ్యులు ప్రవీణ్‌కుమార్ హలీం, పుల్లయ్యతో పాటు తహశీల్దార్ వర్షా రవికుమార్, ఎంపిడిఓ ఎం. చంద్రమౌళి, ఎంపిఓ ముత్యాలరావు, వైద్యాధికారి బాలాజీ నాయక్, ఆర్ఐ ఆదినారాయణ తదితరులు ఉన్నారు.