Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎమ్హెచ్ఓ డాక్టర్ మాలతి
నవతెలంగాణ-తల్లాడ
పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీ వ్యాధిని నివారించవచ్చని ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని, దోమలు పెరగకుండా, దోమలు కుట్టకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ మాలతి సూచించారు. మండల పరిధిలోని అన్నారుగూడెం గ్రామంలో ఇటీవల 8 డెంగ్యూ కేసులు నమోదు కావడంతో గ్రామాన్ని మంగళవారం సందర్శించారు, కాలనీలను పరిశీలించి ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించారు. ఏడుకేసులు రికవరీ కాగా ప్రస్తుతం అన్నారుగూడెం 1, తల్లాడలో 2 కేసులు పాజిటివ్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ వారు రు డ్రై డే వారానికి రెండు రోజులు నిర్వహించాలని, క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయడం మంచిది కాదని, గ్రామపంచాయతీ వారు అందించిన చెత్తబుట్టలోని చెత్తను వేసి డంపింగ్ యార్డ్‌కు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ సీతారాములు, సీఈఓ అప్పారావు, ఎంపీడీవో బి రవీందర్ రెడ్డి, పిహెచ్సి డాక్టర్ నవకాంత్, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, సర్పంచ్ మారెళ్ళ మమత పాల్గొన్నారు.