Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
నిరుద్యోగ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన జరిగే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్ యువతీ యువకులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో రావులపాటి నాగరాజు అధ్యక్షతన ఖమ్మం 1టౌన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది యువకులు ప్రాణ త్యాగం చేశారని వారి త్యాగంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నో ఆశలతో ఉన్న యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని, ఈ మోసాన్ని అడిగితే అపహాస్యం చేస్తున్నారని అందుకే రాష్ట్రంలో నిరుద్యోగ ఆత్మహత్యలు పెరుగుతు న్నాయని ఇవి ప్రభుత్వ హత్యలే అని అన్నారు. అందుకే నిరుద్యోగ యువత ఉద్యమంలోకి రావాలని మరో తెలంగాణ పోరాటం చేయాలని పోరాటం మన ప్రాంతంలోనే ఉందని అన్నారు. అందుకే ఈ నెల 20వ తేదీన ఎస్ఎఫ్ఐ-డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల పిలుపు లో భాగంగా చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి విద్యార్థి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలి అని కార్యకర్తలకు యువత కు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 1టౌన్ కార్యదర్శి కూరపాటి శ్రీను, నాయకులు నరేష్, రాజేష్, రెహమాన్, షోయల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.