Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాల్ కమిషనర్ కి వినతి
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలో స్థానిక ట్రంక్ రోడ్డు లోని భారత పెట్రోలియం బంక్ పక్కన ఇ.నెం. 2-1-359, 360 ముందుగల మన మున్సిపాలిటీ బోర్ని అక్రమంగా పైభాగాన్ని తొలగించి క్రింద నుండి మోటార్ ద్వారా పక్కనే ఉన్నా అపార్ట్మెంట్ వాసులు నీటిని తమ స్వంతానికే వాడుకుంటున్నారు. గత కొంత కాలంగా అక్కడి ప్రజలు మరియు దగ్గరలో ట్రావెల్స్‌కి, స్కూల్స్, కాలేజీ విద్యార్థులు ఎండాకాలంలో ఈ బోర్ ద్వారా మంచినీటిని వినియోగించుకొంటున్నారు. కానీ పక్కనే ఉన్నా అపార్ట్మెంట్ వాళ్లు తమ ప్రయోజనాలు కోసం అక్రమంగా రోడ్డు మీద ఉన్న ప్రభుత్వ బోరుపై భాగం తొలగించి బోర్ క్రింద నుండి పైపులు ఏర్పాటు చేసుకొని అక్రమంగా మంచినీటిని తరలించుకుంటున్నారు. దీని వలన స్థానికులు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమంగా ఏర్పారుచుకున్న పైపులను తొలగించి స్థానికులకు ఉపయోగపడేలా చేయమని, డివిజన్ కాంగ్రెస్ మాజీ అభ్యర్థి యర్రం బాల గంగాధర్ తిలక్ అ ప్రాంత వాసులతో కలిసి మున్సిపల్ కమీషనర్‌కు వినతి పత్రం అందజేశారు.