Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఎర్రుపాలెం
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మహా దివ్య క్షేత్రమైన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కొవిడ్ నిబంధనలకు లోబడి అత్యంత వైభవంగా నేటి నుండి పవిత్రోత్సవంలు ప్రారంభించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.జగన్ మోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాలు ఈనెల 18వ తారీకు నుండి 21వ తారీకు వరకు నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా పవిత్రోత్సవములు నిర్వహించబడునున్నట్లు ఆయన తెలిపారు.18 వ తారీకు ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం అనంతరం విగేశ్వర పూజ, పుణ్యాహ వచనం, మండపారాధన, పవిత్ర ఆదివాసములు, 19వ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు హౌమములు, పవిత్రములను, స్వామివార్లకు, అమ్మవార్లకు, ధారణ చేయుట, అనంతరం బలిహరణ, 20 ఉదయం ఎనిమిది గంటలకు ప్రాత కాల హౌమములు, పూజలు, పవిత్రముల విసర్జన, పూర్ణాహుతి, చక్రస్నానం, 21 ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి అమ్మవార్లకు శాకాంబరి అలంకరణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించబడునున్నట్లు ఆయన తెలిపారు.