Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ
నవతెలంగాణ - వైరా టౌన్
హైదరాబాదు గాంధీ హాస్పిటల్ లో ఇద్దరి మహిళలపై హాస్పటల్ సిబ్బంది మూడు రోజులుగా గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఠాగూర్ విద్యాలయం నుంచి మధిర రోడ్డు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ మాట్లాడుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచార ఘటనను పరిశీలించడానికి వెళ్లిన మహిళా సంఘాల నాయకులు మల్లు లక్ష్మి, సంధ్య తదితర మహిళా ప్రతినిధి బృందంను అరెస్టు చేయడాన్ని ఐద్వా ఖండిస్తోందని అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, అత్యాచార ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, అధ్యక్షురాలు మచ్చా మణి, చింతనిప్పు సులోచన, కౌన్సిలర్ కర్నాటి నందిని, ఉప్పెర్ల రాణి, బత్తుల ప్రమిల, తోట కృష్ణవేణి, చావ కళావతి, కంసాని మల్లిక, తోట పద్మావతి తదితరులు పాల్గొన్నారు.