Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలారం పంచాయతీ పాలకవర్గం ఘన సన్మానం
- పల్లె ప్రగతి విజయవంతం చేయడం అభినందనీయం
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు మండలాన్ని అభివృద్ధిలో ఉన్నతంగా నిలిపిన ఎండీఓ అప్పారావు, మండల పంచాయతీ అధికారి అరుణ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఉప్పు దీప్తీలకు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్ ధురిశెట్టిల చేతుల మీదుగా ఆదివారం ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పోలారం పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎండీఓ అప్పారావు, మండల పంచాయతీ అధికారి అరుణ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఉప్పు దీప్తి, సర్పంచ్ వాంకుడొత్ సరోజిని, ఎంపీటీసీ ఈసాలా పాపమ్మలకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి, బొకెన్ ఇచ్చి ఘనంగా సత్కరించి సన్మానించారు. పోలారం పాలకవర్గం అభినందించింది.
ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీడీవో అప్పారావు, ఎంపీవో అరుణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పల్లె ప్రగతి పనులు విజయవంతంగా చేసిన వారికి సరైన గుర్తింపు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. చేసిన కష్టానికి ఫలితం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీరామ్ కోటయ్య, పాలక వర్గ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.