Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
ప్రస్తుతం ఖరీఫ్ నందు పంటల నమోదు కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు ఏఏ రకాల పంటలు సాగు చేస్తున్నారో వివరాలు సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారికి తెలియజేసి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అశ్వారావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు అప్జల్ భేగం సూచించారు. శుక్రువారం దమ్మపేట మల్లారంలోని రైతు వేదిక నందు దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు చెందిన వ్యవసాయ విస్తరణాధికారులు వ్యవసాయాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు బీమాకు సంబంధించి కొత్త పాసుపుస్తకాలు వచ్చిన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం బ్యాంకు పాసుపుస్తకం జిరాక్సులతో పాటు నామిని వివరాలతో సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి ఈ- నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎవోలు, నవీన్, చంద్రశేఖరరెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు రవీంద్రరావు, రాజేశ్వరరావు, అనుబాబు, దీప్తి , రాయుడు, సూరిబాబు పాల్గొన్నారు.