Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టేకులపల్లి: కొత్తగూడెం, ఇల్లందు ప్రధాన రహదారిలోని రోళ్ళపాడు క్రాస్ రోడ్డు వద్ద కారు అదుపు తప్పి జంబో వాగులో పడింది.ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, కుటుంబీకులకు గాయాలైయ్యాయి. టేకులపల్లి ఎస్ఐ రాజ్ కుమార్ కథనం ప్రకారం టేకులపల్లి మండలంలోని మద్రాసు తండాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను మాళోతు జగదీష్ బాబు(30) మంగళవారం రాత్రి ఇల్లందు వైపు నుండి కొత్తగూడెం వైపు వస్తుండగా టేకులపల్లి మండలంలోని తొమ్మిదోమైలుతండా, రోళ్ళపాడు క్రాస్ రోడ్ మధ్య కల్వర్టు వద్ద కారు అదుపుతప్పి జంబో కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో చెన్నైలో సీఆర్ పీఎఫ్ జవానుగా ఉద్యోగం చేస్తున్న జగదీష్ బాబు మృతిచెందాడు. మూడు రోజుల క్రితం సెలవుపై స్వగ్రామమైన మద్రాస్ తండా వచ్చినట్లు తెలిపారు. తన భార్య పుష్పలతతో పాటు ఇద్దరు పిల్లలను అత్తగారింటికి తీసుకెళ్లి తిరిగి స్వగ్రామమైన తండకు వస్తుండగా కారు పల్టీ కొట్టింది. భార్యకు, పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి. మృతిని తండ్రి ఫిర్యాదు మేరకు బుధవారం శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.