Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంఖారావంను జయప్రదం చేయండి : కొండపల్లి శ్రీధర్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 479 గ్రామ పంచాయతీలలో 2000 మంద గ్రామ పంచాయతీ కార్మికులు, 4 మున్సిపాలిటీలలో 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు కోవిడ్ తదితర అత్యవసర ఆరోగ్య సంక్షోభం వచ్చినప్పుడు ముందు వరుసలో నిడబడ సేవలందిస్తున్నారు. అతి తక్కువ వేతనాలు గ్రామ పంచాయితీ కార్మికులకు రూ.8,500లు మునిసీపాలీటీ కార్మికులకు రూ. 12,000లను మాత్రమే ఇందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది దళితులుగా ఉన్నారు. వీరి శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించటం లేదు. కాంట్రాక్టు కార్మికులు స్కీమ్ వర్కర్స్ అందరికీ పీఆర్సీ ప్రకటించి వీరిని మాత్రం విస్మరింది. వీరికి కూడా పీఆర్సీ వర్తింప చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పంచాయతీ కార్మికులకు రూ.19 వేలు, మున్సిపాలిటీ కార్మికులకు రూ.24 వేల వేతనం ఇవ్వాలని కేటగిరిల ఆధారంగా (డ్రైవర్లు, ఎలక్ట్రీషన్, పంపు ఆపరేటర్లు వగైరా) పీఆర్సీలో నిర్ణయించిన గ్రేడ్ల ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ డేలలో నిరసన తెలియచేశారు. జూన్ 28, 29, 30 తేదీలలో మండల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు, జూలై 5వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముట్టడికి సిద్ద్ధమైనారు.
కానీ, ముఖ్మమంత్రి కేసీఆర్ జూన్ 27వ తేదీన దళిత సాధికారత సమావేశంలో పీఆర్సీ తరహాలో మంచి నిర్ణయాత్మకమైన విధానాన్ని రూపొందిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, పర్మినెంట్ గురించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి నేటికీ 52 రోజులు అవుతున్న ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. మంచి నీటి సరఫరా, వీధిలైట్లు, పారిశుద్య తదితర పనులు తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు కేటాయించిన వారు విడివిడి శాఖలలో పనిచేసేవారు. మల్టీ పర్పస్ విధానంలో అన్ని పనులు ఒకరితోనే చేపిస్తున్నారు. 12 గంటల పని చేపిస్తున్నారు. బానిస చాకిరీ చేపిస్తున్నారు. నెలల తరబడి వేతనాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా ఉంది. ఇట్టి దుర్భర పరిస్థితులలో ఆగస్టు 6 కలెక్టర్ కార్యాలయంను ముట్టడి చేయడం జరిగింది.
అయినప్పటికీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ఆగస్టు 20వ తేదిన హూజూరాబాద్‌లో జరిగే శంఖారావంనకు పంచాయతీ, మున్సిపాల్టీ కార్మికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి శంఖారావం పూరించడానికి సిద్ధమయినట్టు తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ తెలిపారు. జయప్రదం చేయాలని కోరారు.
డిమాండ్స్
1) ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం పీఆర్సీ అమలు చేయాలి
2) కోవిడ్ నేపథ్యంలో మొదటి వరుసలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
3) మల్టీ పర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలి పని భారం తగ్గించాలి
4) ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలి
5) ఆదివారం, పండుగ సెలవులు ఇవ్వాలి
6) ప్రతి కార్మకుడికి రూ. 20 లక్షల బీమాసౌకర్యం కల్పించాలి
7) 8 గంటల పని విధానం అమలు చేయాలి
8) కారోబార్, బిల్లు కలెక్టర్లకుప్రత్యే హౌదా కల్పించాలి. అసిస్టెంట్ కార్యదర్శిగా నియమించాలి