Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
న్యుమోనియా నుంచి చిన్నారులను రక్షించడానికి తప్పనిసరిగా టీకా వేయించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో న్యూమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ చిన్నారులకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను న్యుమోకాకల్ న్యుమోనియా నుండి రక్షించడానికి నూతన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం చాలా సంతోషమని తెలిపారు. ఈ వ్యాక్సిన్ చిన్నారులను వ్యాధి నుండి రక్షింస్తుందని చెప్పారు. ఊపిరి తిత్తులను పివిసి వ్యాక్సిన్ న్యుమోకాకల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నుండి సమర్ధవంతంగా పనిచేస్తుందని, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు మెనింజైటిస్, న్యుమోనియా,సెఫ్టిసిమియా వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుకు గురవుతారని, దీని వల్ల మెదడు దెబ్బతిని చిన్నారులు మరణించే ప్రమాదం ఉందని చెప్పారు. దగ్గు, తుమ్ములు ద్వారా ఒకరి నుండి మరొకరి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, చిన్నారులు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది పడతారని చెప్పారు. శిశువులకు ఈ వ్యాక్సిన్ మొదటి డోసు 6 వారాలలోపు, రెండవ డోసు 14 వారాలు లోపు తదుపరి బూస్టర్ డోస్ 9 నెలలలోపు వేయించాలని ఆయన చెప్పారు. టీకా కొరత లేకుండా అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని, ఏ ఒక్క చిన్నారికి కూడా వ్యాక్సిన్ అందలేదనే పరిస్థితులు రావొద్దని మనందరం చిన్నారులను రక్షించేందుకు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించు విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. ఈ వాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్లో రూ.4వేలు ఖరీదు ఉంటుందని , శిశు మరణాలు తగ్గించడానికి పిల్లల సంక్షేమం కోసం ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఉపకేంద్రాల్లో ప్రతి బుధవారం,శనివారం సాధారణ టీకాలతో పాటు, పీసీవి కూడా ఇవ్వడం జరుగుతుందని, అందరికి అందుబాటులో ఉంటుందని తెలిపారు.
సింగరేణి సంస్థలో సర్వేయర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన టి.గట్టయ్య నాపా అసోషియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి 52వేల విలువ గల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ విరాళంగా ఇవ్వడం పట్ల కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సరళ, డాక్టర్ రవిబాబు, వైద్యులు వినోద్, నాగేంద్రప్రసాద్, చేతన్, సుజాత, నాపా సభ్యులు డాక్టర్ నరేష్, డాక్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు.