Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాసాని అయిలయ్య
నవతెలంగాణ సుజాతనగర్
దళిత బంధుని రాష్ట్రమంతా వర్తింపజేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య అన్నారు. బుధవారం రాఘవాపురం గ్రామ శాఖ మహాసభలు మురుపేటి నాగేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో వారు పాల్గొని మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికలలో దళితుల ఓటు బ్యాంకు 17 శాతం ఉన్నందున ఓటింగ్ రాబట్టడానికి రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారని అన్నారు. దళితులకు 10 లక్షలు ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెబుతున్నారని అన్నారు. దళితుల మీద ప్రేమ ఉంటే మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వీర రమేష్, కాట్రాల తిరుపతిరావు, బచ్చలికూర శ్రీను, గండమళ్ళ భాస్కర్, మద్ది పోయిన గోవర్ధన్, శ్రీధర్ రాజు, మరిపెటి రాములు తదితరులు పాల్గొన్నారు.