Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల తీర్మాణం
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధుతో పాటు కూలీ బంధు పథకాన్ని కూడా అమలు జరపాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల తీర్మాణం చేశాయి. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహంచారు. జాటోత్ కృష్ణ, మెరుగు ముత్తయ్యల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్లతో పాటు సిఐటియు, అఖిల భారత రైతు కూలీ సంఘం, మాలమహానాడు, రైతు సంఘం, ఆవాజ్, మహిళా సంఘం, పట్నం, ముస్లీం మైనారీటి హక్కుల వేదిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తీర్మాణం ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దళిత బంధు పధకం ప్రవేశ పెట్టింది. ప్రతి యూనిట్కి రూ.10 లక్షలు ఆర్ధిక సహాకారం అందిస్తామని, లబ్దిదారులు వారికి ఇష్టమెచ్చిన వ్యాపారాన్ని వారు ఏ ప్రాంతంలోనైన చేసుకొని జీవనం సాగించే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. లబ్దిదారులు ఇట్టి సొమ్మును తిరిగి చెల్లించే అవకాశం లేదనే మినహాయింపుని ఇవ్వడం శుభపరిణామం. ఈ పధకాన్ని వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్లు స్వాగతిస్తున్నావని తెలిపారు. ఈ పధకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలతో సంబంధం లేకుండా ఏకకాలంలో హుజురబాద్తో పాటు రాష్ట్రమంతా అమలు జరపాలన్నారు. దళితులతో పాటు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న ఇతర కూలలలోని పేదలందరికీ ఈ పధకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు ప్రతిపాదించగా, హాజరైన అన్ని ప్రజా సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.
నియోజకవర్గంలోని దళితులతో పాటు ఇతర పేదలందరికీ ఈ పథకం పూర్తిస్ధాయిలో వర్తింప చేసి బతుకు భరోస కల్పించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల ప్రతినిధులు: సిఐటియు కొండపల్లి శ్రీథర్, అఖిలభారత రైతు కూలి సంఘం నాయకులు రవీందర్, ఉమర్, ఆవాజ్ సయ్యద్ నబి, రహీమ్, రజాక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాద్యక్షులు ఆర్.శ్రీనివాస్, మాలమహానాడు నాయకులు కూరపాటి రవిందర్, సీరా చిరంజీవి, పట్నం నాయకులు భూక్య రమేష్, మహిళసంఘం నాయకురాలు సందకూరి లక్ష్మి, రైతు సంఘం నాయకులు వి. నాగేశ్వరరావు, విజరు, తదితరలు పాల్గొన్నారు.