Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే స్టేషన్ ఎదుట సీపీఐ(ఎం) ఆందోళన
నవ తెలంగాణ-మధిర
మధిర రైల్వే స్టేషన్లో రెండో టికెట్ కౌంటర్‌ను ప్రారంభించాలని, భద్రాచలం రోడ్డు విజయవాడ ప్యాసింజర్ పునరుద్ధరణ చేయాలని, మధిర రైల్వే స్టేషన్ నందు అన్ని రకాల ట్రైన్లకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. స్టేషన్ మాస్టర్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు, మండల కార్యదర్శి మంద సైదులు, సిఐటియు జిల్లా నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వడ్రాణపూ మధు, మద్దాల ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాజీ, వెంకట నరసయ్య, ముచ్చు నాగేశ్వరరావు, పేరు స్వామి తదితరులు పాల్గొన్నారు.