Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 20న జరుగు చలో హుజురాబాద్ శంఖారావం సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఖమ్మం రూరల్ మండలం విస్తృత స్థాయి సమావేశం వరంగల్ క్రాస్ రోడ్ లోని తమ్మినేని సుబ్బయ్య భవనంలో సిఐటియు కార్యాలయంలో మండల ఉపాధ్యక్షులు పెద్దపొంగు సైదులు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో మోహన్రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు చెప్పి భ్రమలు కల్పించటం తప్ప వారికి చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ మేడికొండ నాగేశ్వరరావు, గ్రామపంచాయతీ యూనియన్ మండల నాయకులు వాసం రాంబాబు, గంజి రామయ్య, ఉపేందర్, కొర్ని నాగరాజు, వి.ధర్మేందర్, విజరు, మహేష్, శ్రీను, నరేష్, రమేష్, జె.రాములు, ధరావత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.