Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
ఇది పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మానికి ఆనుకొని మున్నేరు-కరుణగిరి మధ్యన ఉన్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ రోడ్ల దుస్థితి. ఇక్కడ డ్రెయినేజీ వ్యవస్థ అంటూ లేదు. ఇళ్ల మధ్యే మురుగు నీరు వర్షపు నీటితో కలిసి దోమలు, ఈగలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో 70 కుటుంబాలకు పైగా నివసిస్తున్నాయి. డెంగ్యూ జ్వరాలతో ఈ కాలనీ ప్రజలు అవస్థ పడుతున్నా ఎవరికీ పట్టడం లేదు. అటు పంచాయతీకి నోచుకోక, ఇటు నగరపాలక సంస్థ పరిధిలోకీ రాక అటుఇటు గాని రీతిలో అధ్వాన్నంగా ఈ కాలనీ దుస్థితి తయారైంది. ''అయ్యా ఎమ్మెల్యేగారు, సుడా చైర్మన్ గారూ మీరైనా స్పందించి విలీనం నుంచి వీడిన ఈ కాలనీల గోడు పట్టించుకోండి... మా కాలనీకి ఒక్కసారి వచ్చి చూడండి'' అంటూ వాపోతున్నారు కాలనీ వాసులు. వర్షం వస్తే రహదారులన్నీ చెరువును తలపిస్తాయి. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే అవస్థలు పడాల్సిందే. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్లు, సైడ్ డ్రైనేజ్‌లు నిర్మించాలని కాలనీ వాసుల కోరిక.