Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఫొటో అనేది ఒక మధు జ్ఞ్నాపకం. గత స్రృతులను నిలువెత్తు సాక్షంగా సజీవంగా ఉంచేది ఫొటో.. కాని సెల్ఫీలతో అందమైన ఫొటోలు తీస్తూ సామాజిక మాద్యమాల ద్వారా ఎదుటి వారిని సంతోషాలతో ముంచెత్తుతున్న నేటి రోజుల్లో డిజిటల్ ఫోటో గ్రఫీ రంగం రోజు రోజుకు దూసుకు పోతుందనే చెప్పవచ్చు. మండల కేంద్రమైన లకీëనగరంలో తన భర్త పూదోట సూరిబాబు నిర్వహిస్తున్న లోహిత ఫొటో స్టూడియోను కృష్ణవేణి అన్నీ తానై చూసుకుంటోంది.
మండలంలోని చిన్నబండిరేవు గ్రామానికి చెందిన పూదోట సూరిబాబు ఇంటర్ వరకు చదివి ఫొటో గ్రఫీపై మక్కువతో ఫొటో గ్రాఫర్ గా స్థిర పడ్డారు. అదే గ్రామానికి చెందిన కృష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సూరిబాబు అవుట్ డోర్ ఫొటో గ్రాఫర్‌గా రాణిస్తూనే మండల కేంద్రమైన లకీëనగరంలో ఫొటో స్టూడియోను ఏర్పాటు చేశారు. భర్త పెట్టిన ఫోటో స్టూడియోని కృష్ణవేణి అన్నీ తానై చూసుకుంటోంది.
ఆనాడు ఉన్న రీల్ కెమెరాలతో పాటు ఎలార్జ్ ద్వారా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను సైతం అందంగా కడగడంలో ఆమెకు ఆమె సాటి. కాని కృష్ణవేణి మారుతున్న డిజిటల్ ఫోటో గ్రఫీ రంగాన్ని, సాంకేతిక పరిజ్ఞ్నానాన్ని సైతం పునికి పుచ్చుకుని ఫొటో గ్రఫీ రంగంలో దూసుకు పోతోంది. కెనాన్ 5 డి, నికాన్ వంటి అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానం కలిగిన కెమెరాలతో అందమైన ఫొటోలు తీయడంలో ఆమె మేటి సాటి అనే చెప్పవచ్చు.
ఇండోర్ స్టూడియోలో పెళ్లిళ్లకు సంబందించిన ఫోటోలు, పుష్పాలంకరణ ఫోటోలు, పుట్టిన రోజు ఫోటోలు తీస్తూ ప్రతి ఒక్కరి నుండి ఔరా అనిపించుకుంటుంది.
దీంతో పాటు కంప్యూటర్ ద్వారా డిజైనింగ్ అల్బమ్స్, పెక్సీలను తనదైన శైలిలో చేయగల నేర్పరి. ఉపాధి కోసం తన దగ్గరకు వచ్చిన ఎంతో మంది నిరుద్యోగులకు ఫొటో గ్రఫీలో మెళుకువలు నేర్పడంతో పాటు వారికి ఉపాది చూపిస్తోంది.
కృష్ణవేణి వద్ద ఫోటో గ్రఫీ నేర్చుకున్న ఎంతో మంది ఫోటో గ్రాఫర్లు మంచి ఫోటో గ్రాఫర్లు గా స్థిర పడ్డారు.
వేయి మాటలు, వందలాది పదాలతో చెప్పలేని భావం ఒక్క ఫొటో వ్యక్తీకరిస్తుందని ఫొటో గ్రఫీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి ఫొటో గ్రాఫర్ ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం సందర్భహంగా ఒకరిని ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి ఫోటో గ్రాఫర్ పై ఉందనే చెప్పవచ్చు.