Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపు
నవతెలంగాణ-రఘునాధపాలెం
రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను అన్నింటిని వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్స్‌తో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆగస్ట్ 20న జరిగే ఛలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగులు, విద్యార్థులు కదలిరావాలని జయప్రదం చేయాలని డీవైయఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపునిచ్చారు. సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం చిమ్మపుడి గ్రామంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఉపకార వేతనాలు బోధన రుసుములు విడుదల చేయాలని అన్నారు. విద్యాసంస్థలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ తక్షణం విడుదల చేయాలని అన్నారు. నిరుద్యోగ భతి అర్హులైన యువతను ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి యువతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్ పెండింగ్ ఉపకార వేతనాలు విద్యాసంస్థలు వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. చలో ప్రగతి భవన్ ముట్టడికి యువత,నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దసరద. వీరబాబు,వినోద్, సురేష్, దొంతూ. గణేష్, జోనెబోయిన.వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.