Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) త్రీటౌన్ కార్యదర్శి తుశాకుల లింగయ్య
నవతెలంగాణ-గాంధీచౌక్
ఆసరా పింఛన్‌కు రేషన్ కార్డులో పేరు ఉన్న వారికి మంజూరు చేస్తామని ప్రకటించారని, కాని రేషన్ కార్డులు నేటికి కొత్త ప్రింట్ లు రాలేదని, లబ్ధిదారుడు పింఛను పెట్టుకోవడం కోసం కంపల్సరీ రేషన్ కార్డులో పేరు నమోదు అయినప్పటికీ ఆన్లైన్లో కొడితే అర్హత ఉన్న లబ్ది దారుడి పేరు రావడం లేదని, భార్య పేరు వస్తుందని,రషన్ కార్డులలో భార్య యజమానురాలు కావడంతో ఆమె పేరు మాత్రమే చూపిస్తుందని, మిగతా కుటుంబ సభ్యుల పేర్లు లాక్ చేసి ఉన్నాయని సీపీఐ(ఎం) త్రీటౌన్ కార్యదర్శి తుశాకుల లింగయ్య అన్నారు. అర్హత కల్గిన లబ్ది దారులకు రేషన్ కార్డుతో లింక్ లేకుండా అయినా పెన్షన్ మంజూరు చేయాలని, లేదా రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులందరివి పేర్లు డిస్ప్లే అయ్యేలా అన్ లాక్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. తక్షణమే ఈ మార్పు చేయాలని లేని యెడల ఆందోళ తప్పదని హెచ్చరించారు.