Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో కేంద్రంలో బిజెపి పరిపాలనలో మహిళలపై చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గ వీటి సరళ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో ఐద్వా మండల మహాసభ ఎంపీపీ కంకణాల సౌభాగ్యం అధ్యక్షతన బుధవారం జరిగింది. తొలుత మహా సభల ప్రారంభ సూచకంగా ఐద్వా జెండాని బుగ్గ వీటి సరళ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ఆమె మాట్లాడుతూ మహిళలపై సంఘటన జరిగిన రోజు మాత్రమే పోలీసులు, ప్రభు త్వం మహిళలపై ఎంతో ప్రేమ ఉన్నట్లు వేగంగా స్పందిస్తారని, ఆ తర్వాత వదిలేస్తారని ఆమె విమర్శించారు. హైదరాబాద్ నడిబొడ్డున గల గాంధీ ఆస్పత్రిలోనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు పై ఆసుపత్రి వైద్యులు వారంరోజుల పాటు అత్యాచారానికి పాల్పడితే ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎక్కడ ఉందన ఆమె ప్రశ్నించారు. మహిళలకు కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయని విమర్శించారు.
సమాజంలో ప్రస్తుతం ఐద్వా మాత్రమే మహిళలకు అండగా ఉంటుందని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల భారతి, జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ తెలిపారు. ఖమ్మం జిల్లాలో జరిగిన అనేక సంఘటనలపై ఐద్వా స్పందించి బాధితుల పక్షాన అండగా నిలబడి న్యాయం చేసిందన్నారు. అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన లక్ష్మీపురం ఎంపిటిసి జొన్నలగడ్డ సునీత, మండల అధ్యక్షురాలుగా ఎంపీపీ కంకణాల సౌభాగ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకు న్నారు. మహాసభలో ఐద్వా నాయకురాలు గుగులోతు శారద గుడ్డూరి ఉమ, నల్లమోతు వాణి, బంధం వెంకట రాజ్యం, కేతినేని ఇందు, ఆళ్ల పుల్లమ్మ, కర్లకుంట దేవమణి, పసుపులేటి హైమావతి, ద్రోనోదుల రత్నకుమారి, ఉమ్మ నేని ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
వైరాటౌన్ : సెప్టెంబర్ 24, 25, 26 తేదీలలో సూర్యాపేటలో జరగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, అధ్యక్షురాలు బండి పద్మ పిలుపు ఇచ్చారు. బుధవారం స్థానిక ఠాగుర్ విద్యాలయంలో ఐద్వా సీనియర్ నాయకురాలు చావా కళావతి జెండాను ఆవిష్కరించిన అనంతరం తోటా కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఐద్వా వైరా పట్టణ కమిటీ 5వ మహాసభలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి కోసం ఐద్వా కృషి చేస్తోందన్నారు. మహాసభలో ఐద్వా వైరా మున్సిపాలిటీ అధ్యక్షులుగా మచ్చా మణి, కార్యదర్శిగా గుడిమెట్ల రజిత, ఉపాధ్యక్షులుగా మాదినేని రజినీ, కర్నాటి నందిని, సహాయ కార్యదర్శులుగా ఉప్పేర్ల రాణి, బత్తుల ప్రమీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఠాగూర్ విద్యాసంస్థల చైర్మన్ సంక్రాంతి సునీత రవికుమార్ మాట్లాడుతూ నూతన కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో చింతనిప్పు సులోచన, నామ విజయ, నామ అనురాధ, తోట పద్మావతి తమ్మిచేట్టి విజయ, దుద్దుకూరు వీరమ్మ, ఓర్సు సరిత, మాదినేని పద్మ, కంసాని మల్లిక తదితరులు పాల్గొన్నారు.