Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
భాగ్యనగర్‌తండా సబ్ స్టేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండా ప్రాంతంలో లోవోల్టేజీ సమస్యను అధిక మించటానికి భాగ్యనగర్ తండాలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం 25.03.2016 అప్పటి ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ శంఖుస్ధాపన చేశారు. సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయి అప్పటి మంత్రి రోడ్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీదిగా ది.28.12.2017న అట్టహాసంగా ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు తప్ప దానికి నుండి మూడున్నరేళ్లుగా విద్యుత్ సరఫరా జరగటం లేదు. సబ్ స్టేషన్ నిర్మాణంకు దాత భూమిని దానం చేశారు. ఆ సమయంలో భూ నిర్వాసితునికి సబ్ స్టేషన్లో ఉద్యోగం కల్పిస్తామని హామీతో సబ్ స్టేషన్ భూమి ఇవ్వటం అ స్ధలంలో సబ్ స్టేషన్ నిర్మాణం చేయటం జరిగింది. సబ్ స్టేషన్ ప్రారంభం సమయంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం భూ నిర్వాసితునికి ఉద్యోగంకు కల్పించాలని అధికారులకు సూచించారు. ఉద్యోగం విషయం తేలక పోవటంతో భూ నిర్వాసితులు సబ్ స్టేషన్‌కు తాళం వేశారు. మూడున్నరేళ్లుగా తాళం వేసి ఉండటంతో నిరుపయోగంగా ఉంది.
సబ్ స్టేషన్ ముస్తాబు
భాగ్యనగర్‌తండా విద్యుత్ సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరాకు అధికారాలు సన్నహాలు చేస్తున్నారు. సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరాకు అడ్డంకి అయినా భూ నిర్వాసితునికి ఉద్యోగ సమస్యలను అధికారులు పరిష్కరిం చారు. దీంతో సబ్‌స్టేషన్ ప్రారంభానికి అటం కాలు తొలిగాయి. సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరాలో భాగంగా చెట్లు ముండ్ల తుప్పలతో నిండి ఉన్న సబ్ స్టేషన్‌ను గురువారం విద్యుత్ అధికారులు శుభ్రం చేయంచారు. సబ్ స్టేషన్‌ను ట్రాన్స్‌కో ఏడీఏ రామకృష్ణ, ఏఈ విజరుకుమా ర్లు సందర్శించి పనులను పర్యవేక్షించారు.
వారంలో విద్యుత్ సరఫరా - ఏఈ విజరుకుమార్
సబ్ స్టేషన్లో భూ నిర్వాసితునికి ఆపరేటర్ ఉద్యోగం కల్పనతో సమస్య పరిష్కారం అయింది. వారం రోజుల్లో భాగ్యనగర్ సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తాం. ప్రస్తుతం సబ్ స్టేషన్లో కలర్ పనులు, ఇన్సూలేషన్ పనులు చేయటం జరుగుతుంది. సబ్ స్టేషన్ విద్యుత్ సరఫరా చేయటం ద్వారా లో వోల్టేజీ సమస్య పరిష్కారం కానుంది.