Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా, నిస్వార్థంగా అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులను గురువారం కలెక్టర్ తన ఛాంబర్లో అభ్యర్థులకు అందజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 21 మంది జూనియర్ అసిస్టెంట్లు, 1 టైపిస్టు, 3 ఆఫీస్ సబార్డినేట్లు, 2 వాచ్మెన్ పోస్టులను కారుణ్య నియామకం కింద చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఉన్నత విద్యనభ్యసిం చాలని, నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారందరూ నిస్వార్ధంగా, నిష్పక్షపా తంగా, నిజాయితీగా తమ విధులను నిర్వహిం చాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారని... క్లిష్ట సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాల న్నారు. కుటుంబ బాధ్యతలను కూడా సరిగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు సూదన్, కలెక్టరేట్ కార్యాలయ పరిపాలనాధి కారి మదన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.