Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ అమృత చెస్ట్ హస్పిటల్ వైద్యులు డాక్టర్ బాబు రావు పుట్టిన ఉరోజు సందర్భంగా బచ్చలి కూర కరుణాకర్ ఆధ్వర్యంలో అనాధ ఆశ్రమంలో వితరణ చేశారు. ఆనాధ పిల్లలకు మిఠాయిలు పంచారు. గురువారం డాక్టర్ ఇరుకు బాబురావు పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ పరిధిలోని జ్యోతి అనాధ ఆశ్రమానికి 75 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా బచ్చలి కూర కరుణాకర్ మాట్లాడుతూ డాక్టర్ బాబురావు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. కోవిడ్-9, కరోనా వైరస్ సోకిన వారికి అనేక మందికి మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యాని కాపాడారని తెలిపారు. ఆయన అమృత ఆసుపత్రిలో అందించే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెసు జిల్లా నాయకులు బాలశౌరి, ప్రముఖ లాయర్ మారుపాక రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజశేఖర్, బీజేపీ యూత్ లీడర్ దిలీప్, లక్ష్మణ్ పాల్గొన్నారు