Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
నవతెలంగాణ-చర్ల
అత్యంత సామాన్య కుటుంబం నుండి అంచలంచలుగా ఎదిగి నేడు చర్ల వైద్య అధికారిగా విధులు చేపట్టిన వైద్యురాలు సుమను పలువురు అభినందించారు. తను పుట్టిన ఊరు, ఆడుకున్న ప్రాంతం, ఆరోగ్యం బాగోలేనప్పుడు వెళ్లి ఇంజక్షన్ వేయించుకున్న హాస్పటల్లోనే డాక్టర్ వృత్తిని చేపట్టినప్పుడు కలిగే మధుర క్షణాలు ఆ కుటుంబంలో ఎంతో ఆనందాన్నిస్తాయి. అటువంటి సంఘటన గురువారం మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే అతి సామాన్య కుటుంబానికి చెందిన మోతుకూరి ప్రభాకర్ రావు డిగ్రీ వరకు చదువుకొని ఎల్ఐసీ ఏజెంట్‌గా జీవనం సాగిస్తున్నాడు. భార్య సుజాత అంగన్ వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తూ ఉండేవారు. వారికి ఇద్దరు ఆడ సంతానం కలిగారు. మొదటి సంతానంగా సుమతి, రెండవ సంతానంగా కావ్య జన్మించడంతో వారి ఆలనాపాలనా చూస్తూ చదువు విషయంలో రాజీ పడనీయకుండా తల్లిదండ్రులుగా తమ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పెద్ద కుమార్తె సుమ హైదరాబాదులోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రారంభంలో తన తల్లి అకాల మరణం చెందినా, తండ్రి ప్రోత్సాహంతో మొక్కవోని ధైర్యంతో మెడిసిన్ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఎదురుచూ స్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యాధికా రుల పోస్టులను భర్తీ చేయాలనే సంకల్పంతో నోటిఫికేషన్ విడుదల చేయగా దరఖాస్తు చేసు కున్న సుమ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే చర్ల హాస్పిటల్ వైధ్యాధి కారిణిగా గురువారం బాధ్యతలు చేపట్టడంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యురాలిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సుమను సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మురళీకృష్ణ, మండల కార్యదర్శి కొండా చరణ్, సీఐటీయూ నాయకురాలు రాధాకుమారి, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, ఎంపీపీ గీద కోదండ రామయ్య, జెడ్పీటీసీ ఇర్పా శాంత, చర్ల సొసైటీ అధ్యక్షులు పరుచూరి రవికుమార్ తదితరులు, మండల వాసులు అభినందించారు.
.