Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గుట్టకు మర్చిపోలేని రోజు మోహర్రం
- 1938లో ఇల్లందు పూసపల్లి గనిలో విషవాయువు
- జీఎంతో సహా 120 మంది మృతి విశాదం
- గుర్తుగా ఇల్లందులో ప్రతి శుక్రవారం వారాంతపు సెలవు
- నేటికి సింగరేణిలో మొహర్రం సెలవు
నవతెలంగాణ-ఇల్లందు
1889లో ఇల్లందు(బొగ్గుట్ట)లో బొగ్గు గనులు ఆవిర్భవించిన తర్వాత 47 సంవత్సరాల పాటు కార్మికులకు కనీస సౌకర్యాలు లేవు. చీకటి గుహాల్లా ఉంటే బొగ్గుగనుల్లో పనులు నిర్వహించేవారు. క్యాపు ల్యాంపులు, విద్యుత్ దీపాలు లేవు. కిరోసిన్ దీపాల వెలుగులో పనిచేసేవారు. ఢ్రిల్లింగ్ మిషన్ సదుపా యాలు లేవు. గన్ఫౌడర్తో బ్లాస్టింగ్ చేసేవారు. గనుల్లో విపరీతమైన పొగ, వేడి ఉండేది. గాలి, నీరు, వెలుతురు మచ్చుకైనా కానరాలేదు. గనుల్లో ఊటల ద్వారా వస్తున్న బొగ్గుతో మురికిగా ఉన్న నీరు తాగేవారు. ప్రాణానికి కనీస రక్షణ, భద్రత లేకుండా భయంభయంగా పనిచేసే వారు. కార్మికుల బావిలో పనికి వెలితె తిరిగి వచ్చేదాకా కుటుంబాలు బిక్కుబిక్కుమని ఉండాల్సిందే. చేసే కష్టానికి ఇచ్చే బేదా, పావళా, చాలీ చాలని వేతనాలతో కార్మికులు దుర్బర దారిద్య్రంలో జీవితాలను గడిపారు.
1938లో ఇల్లందు గనిలో విషవాయువు వెలువడి జీఎంతో సహా 120 మంది మృతి విశాదం
ఇల్లందు మండలంలోని పూసపల్లి గ్రామానికి వెళ్ళే రహదారిలో ఉన్న స్ట్రట్ ఇంక్లైన్ గనిలో 1938 సంవత్సరం మార్చి-12న శుక్రవారం మోహర్రం పండు గ రోజున నాడు దేశ చరిత్రలో మరిచిపోలేని విశాదం చోటుచేసుకుంది. భూగర్భగనిలో విషవాయు వులు వెలువవడ్డాయి. 20వ తేదీ శుక్రవారం కూడ మో హర్రం రావడం యాదృచ్చికమైంది. విషవాయువుల బారి న కార్మికులు పడ్డారు. ఈ ప్రమాదంలో 120 మంది మృ త్యువాత పడ్డారు. ఆనాడు దేశ చరిత్రలో బొగ్గు పరి శ్రమలో జరిగిన అతి పెద్ద ప్రమాదం. అప్పటి బ్రిటీష్ అధికారి, బొగ్గునుల జనరల్ మేనేజర్ ఆండ్రూస్, మరో ఇద్దరు అధికారులు అసన్, యంగ్లతోపాటు 117 మ ంది కార్మికులు మృతి చెందారు. వారి మృతదేహాలను వెలికి తీయడానికి వారం రోజులకు పైగా పట్టింది. ము గ్గురు అధికారులను కొత్తగూడెం సెయింట్ అండ్రూస్ చర్చిలో ఖనంనం చేయగా కార్మికుల మృత దేహాలను ఇల ్లందు 24 ఏరియాలో ఒకే చోట సమాధి చేశారు. ఈ భయానక రిస్ధితిలో ఇల్లందు, కొత్తగూడెంలోని గనులను కొంతకాలంపాటు మూసివేశారు. స్వాతంత్య్రానంతరం అధికారులు మళ్ళీ బావిని తెరిచారు. గ్యాస్ తీవ్రత తగ్గకపోవడంతో ఆనాటి నుండి నేటి వరకు నిరవధీకంగా మూసివేశారు.
గుర్తుగా నేటికి మొహర్రం రోజు, ఇల్లందులో ప్రతి శుక్రవారం వారాంతపు సెలవు
విశాద ఘట్టానికి గుర్తుగా ప్రమాదం జరిగిన రోజును వారంతపు సెలవుగా అధికారులు ప్రకటించారు. ఆనాటి నుండి సింగరేణి వ్యాపితంగా శుక్రవారం గనుల్లో సెలవు ప్రకటించారు. గత 9 సంవత్సరాల నుండి సింగరేణిలో ఈ పద్ధతి మార్చారు. ఆదివారం సెలవు దినంగా మార్పు చేశారు. సింగరేణిలో ఒక్క ఇల్లందులో మాంత్రమే నేటికీ శుక్రవారం కార్మికులకు సెలవు దినంతోపాటుగా మోహర్రం రోజున సింగరేణి వ్యాపితంగా నేటికి సెలవు దినగంగా యాజమాన్యం ఇస్తోంది. దీనికి గుర్తుగా 24 ఏరియాలోని సృతి వనం, పూపల్లి ్గగ్రామంలో స్థూపాన్ని ఏర్పాటు చేశారు. యేటా జీఎం ఆధ్వర్యంలో అధికారులు, కార్మికులు శ్రధ్దాంజలి ఘటిస్తున్నారు.