Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరాయపాలెం రేషన్ డీలర్‌పై భగ్గుమన్న గ్రామస్తులు
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని సింగరాయపాలెం గ్రామంలోని రేషన్ డీలర్‌పై గ్రామస్తులు భగ్గుమన్నారు. టిఆర్ఎస్ మండల నాయకులు ఏలూరి శ్రీనివాస్‌రావు, స్థానిక న్యూడెమోక్రసీ నాయకులు మేడి కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం......ఈనెల14 వతేదిన రేషన్ షాప్‌కు సూమారు డబ్బై క్వింటాలు సన్నబియ్యం ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పంపించింది. ఆ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ క్వింటాకు 2000 నుంచి 3000 అమ్ముకుంటూ పేదప్రజలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామస్తులతో కలిసి రేషన్ షాపును గురువారం ముట్టిడించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు రేషన్ షాప్ వద్దకు దొడ్డుబియ్యం తీసుకొని తరలివచ్చారు. దీంతో రేషన్ డీలర్‌కు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సన్నబియ్యం పంపిణీ చేస్తేనే ఇక్కడనుంచి వెళ్లడం జరుగుతందని ఆందోళన చేయడంతో చివరకు డీలర్ లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వక తప్పలేదు. లబ్ధిదారుల నుంచి సగం దోడ్డుబియ్యం తీసుకొని సగం మాత్రమే సన్నబియ్యం ఇచ్చారు. ప్రతినెల ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా సర్వర్ ప్రాబ్లమ్ ఉందని, రేపు రా మాపు రా అంటూ రేషన్ షాపు చూట్టూ తిప్పుకుంటున్నారని చివరకు మరోరోజు బియ్యానికి పోతే బియ్యం ఇచ్చే సమయం అయిపోయందని వెళ్లగోడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీలర్‌ని మార్చాలని సంతకాలు సేకరణ చేపట్టారు.కారణం గతంలో ఈ డీలర్ బియ్యాన్ని ఆక్రమంగా తరలిస్తుండటంతో గ్రామస్తులు పట్టించిన సంఘటనలు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి డీలర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్, న్యూడెమోక్రసీ నాయకులు మట్టా శ్రీను, అలవాల తిరుమలరావు, గీరక వెంకటి, కంకణాల పెద్ద వెంకటి ,చిన్న వెంకటి, సత్తయ్య, శంబోష్, అచ్చయ్య , రమేష్ నాగేష్ పాల్గొన్నారు.