Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విరమించుకోవాలి
నవతెలంగాణ - వైరా టౌన్
మున్సిపల్ కార్మికులకు ఇచ్చే వేతనాలను సక్రమంగా చెల్లించాలని, 11వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికులకు రక్షణ పరికరాలు, పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ పేస్లిప్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ %డ% ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, సిపిఐ వైరా మండల కార్యదర్శి యామాల గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయం నందు ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం కోపెల మధు అద్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా మందా వెంకటేశ్వర్లు, యామాల గోపాలరావు మాట్లాడుతూ వైరా పురపాలక సంఘం కమిషనర్ కావాలని కార్మికుల పట్ల కక్ష కట్టి నోటికొచ్చిన బూతులు తిడుతూ కార్మికులను వేధిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విరమించుకోవాలని, సంవత్సరా లు కావస్తున్నా ఇ.ఎస్.ఐ గుర్తింపు కార్డులు, పి.ఎఫ్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. కార్మికులం దరికీ సమాన వేతనం చెల్లించాలని, పనిముట్లు క్రమం తప్పకుండా అందించాలని డిమాండ్ చేశారు. వైరా మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. రానున్న రోజులలో పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి మున్సిపల్ గౌరవ అధ్యక్షులు గారపాటి అశోక్, రాయపూడి శ్రీను, అవినాష్ రెడ్డి, ఇరస్వామి, దాసు, లక్ష్మయ్య, నాగమణి, సామ్రాజ్యం, రాజు, మధు సూదన్ రెడ్డి, సురేష్ తది తరులు
పాల్గొ న్నారు