Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తూనే అత్యంత పేదలుగా ఉండి కూలి పనే జీవనాధారంగా ఉన్న వారికి కులంతో నిమిత్తం లేకుండా కూలీ బంధు పథకం పెట్టి కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఆ సంఘం మండల స్థాయి సమావేశం జరిగింది. సభలో పొన్నం మాట్లాడుతూ దళిత బంధు ఒక్క హుజురాబాద్ వరకే పరిమితం కాకుండా రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం మండల కార్యదర్శి శీలం గురుమూర్తి అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నెకంటి సంగయ్య, మండల అధ్యక్షుడు బారి మల్సూర్, వివిధ సంఘాల నాయకులు కందుల బాబు, మూడు గన్యానాయక్, నలగాటి బాలయ్య, లింగా సీతారాంరెడ్డి, మందా నాగేశ్వరరావు, బొజ్జవెంకట్రాములు, కలకొండ వీరస్వామి, వడ్తియాహరి ప్రసాద్, జవ్వాజిపవన్, కొరట్ల పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : దళిత బంధుతో పాటు కూలీబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని రైతు సంఘం జిల్లా నాయకులు రాయల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో గురువారం ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల డ్రామాలో భాగంగా దళిత ముందు పథకం కేసీఆర్ పెట్టారని ఆయన విమర్శించారు. సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ టిఎస్ కళ్యాణ్, సొసైటీ వైస్ చైర్మన్ బట్టు పురుషోత్తం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, రైతుసంఘం మండల అధ్యక్షుడు కందుల భాస్కరరావు, రైతుసంఘం నాయకులు మందరపు వెంకన్న, మర్లపాటి కోటేశ్వరరావు, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మెట్టల సతీష్ తదితరులు పాల్గొన్నారు.