Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భీమదేవరపల్లి
పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన సంఘటన భీమదేవరపల్లి లో గురువారం చోటుచేసుకుంది. ముల్కనూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్లపల్లి గ్రామానికి చెందిన బోనగిరి సాయితేజ, జొన్నగిరి రవిశర్మ అనుమానా స్పదంగా వెళ్తున్నారు. గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు భీమదేవరపల్లి మండలం లోని ముల్కనూర్ లో గత నెలలో తాళం వేసిన ఇంట్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుండి రూ.2లక్షల20వేలు, 27.30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ పుష్ప, ఏసీపీలు బాబురావు జితేందర్ రెడ్డి, సీసీఎస్ సీఐ రమేష్, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ముల్కనూర్ ఎస్సై చంద్రమోహన్ పాల్గొన్నారు.