Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు అతి త్వరలో మదర్ డెయిరీ రైతులకు రూ.4 బోనస్ అందించేందుకు కషి చేస్తానని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి న్నారు. గురువారం నియోజకవర్గంలోని మదర్ డెయిరీ గ్రామాల చైర్మెన్లకు సన్మాన కార్యక్రమాన్ని పట్టణంలోని భరత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జరిగే మదర్ డెయిరీ ఎన్నికల్లో ఆలేరు ప్రాంతానికి చెందిన వారే చైర్మెెన్ అయ్యే అవకాశం ఉందన్నారు. యాదాద్రి జిల్లా నుండి ప్రతిరోజు 5 లక్షల 60 వేల పాల ఉత్పత్తి జరుగుతుందన్నారు. గతంలోనే పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ద్వారా ప్రోత్సహకం ఇచ్చేందుకు మాట తీసుకున్నామన్నారు. కరోనా ఉండడంతో బోనస్ తీసుకురావడంలో కొంచెం జాప్యం జరిగిందని వివరించారు .మదర్ డెయిరీ పరిధిలో ఇన్సూరెన్స్ చేసుకుని మృతి చెందిన పశువులకు కూడా కలెక్టర్‌తో మాట్లాడి నష్టపరిహారం అందేలా కషి చేస్తానన్నారు. కొన్ని దొంగ సొసైటీలు కూడా పనిచేస్తున్నాయని అటువంటి వాటిని పక్కన పెట్టాలని సూచించారు. డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మదర్ డెయిరీని వాడుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే పార్టీపరంగా మాట్లాడి పోటీకి నిలబడాలని సవాల్ విసిరారు. ఆలేరు నియోజకవర్గంలో 117 మంది టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు . ఈ సమావేశంలో ఆల్డా చైర్మెన్ మొతే పిచ్చి రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, డైరెక్టర్లు చింతలపూరి వెంకట్ రామ్ రెడ్డి, కల్లేపల్లి శ్రీశైలం,గాల్ రెడ్డి,శ్రీకర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్,ఉప్పలయ్య ,పడాల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.