Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఎలాంటి వ్యాధి గ్రస్తులకైనా అతి తక్కువ ఖర్చుతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని అందించడంలో మేటిగా రాణిస్తూ వైద్య వృత్తికే వన్నె తెచ్చిన పేద ప్రజల వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి జగదీష్ ప్రసాద్ మరణం పేదల ప్రజలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య అన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు రామవరంలోని తన స్వగృహంలో డాక్టర్ జగదీష్ ప్రసాద్ తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) నేతలు పట్టణ ప్రముఖులు, అభిమానులు, డాక్టర్లు, అన్ని రాజకీయ పార్టీల నేతలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, సీపీఐ రాష్ట్ర సహయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య కలిసి డాక్టర్ భౌతికాయంపై ఎర్రజెండా కప్పి, పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్లు అంటూ సీపీఐ(ఎం) కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాసాని ఐలయ్య మట్లాడుతూ డాక్టర్ జగదీష్ వామ పక్ష వాదిగా, అభ్యుదయ భావాలతో కమ్యునిస్ట్ పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచే విధంగా, అన్ని విధాలుగా పార్టీ కార్యక్రమాలకు సహకారం అందించేవారన్నారు. ముఖ్యంగా పేద, గ్రామీణ ప్రజలకు ఆయన అందించిన సేవలు ప్రజలు ఏనాటికి మరిచి పొలేరని తెలిపారు. ఆయన పేదల పక్షపాతిగా నిలిచాడని, పేదల వైద్యుడిగా వారి ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారన్నారు. ఆయన మరణం పేద ప్రజలకుతీరనిలోటన్నారు. డాక్టర్ జగదీశ్ ప్రసాద్ మరణ వార్త తెల్సుకున్న రామవరం, కొత్తగూడెం, తదితర గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వాచ్చరు ఇంత కాలం ఎంతోసేవలందించిన డాక్టర్ని చివరి సారిగా చూసేందుకు బారులు తీరారు. కంటతడి పెట్టుకున్నారు. పట్టణంలోని ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రముఖ వైద్యులు, సీపీఐ(ఎం) శ్రేణులు, అభిమానులు భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ, ఐలూ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేశ్ కుమార్ మక్కడ్, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్, వీరస్వామి, ప్రకాష్, విజయగిరీ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.