Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన మహిళలను బలవంతంగా జీపు ఎక్కించిన అటవీ సిబ్బంది
- పోడు సాగు దారులకు అండగా ఉంటామన్న ప్రజా ప్రతినిధులు ఎక్కడ..?
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం అటవీ రేంజి పరిధిలోని సుజ్ఞ్నాపురం అటవీ బీట్ పరిధిలోని తోగ్గూడెం కంపార్ట్ మెంట్లో పోడు భూముల రగడ గత కొంత కాలంగా సాగుతోంది. గిరిజనులు తాము యేండ్ల తరబడి పోడు కొట్టి భూములు సాగు చేసుకుంటున్నామని తమ వాదనను వినిపిస్తుండగా, అటవీ శాఖ అధికారులు మాత్రం కంపార్ట్ మెంట్ 125లో అటవీ శాఖ చెందిన అటవీ భూమి అని తెలపడంతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు సైతం చేశారు. శుక్రవారం పెద్ద ఎత్తున అటవీ సిబ్బంది హరిత మొక్కలతో తోగ్గూడెం కంపార్ట్ మెంట్ వద్దకు వెళ్లా రు. ఆ సమయంలో పోడు గిరిజన మహిళా రైతులు మొక్కలతో వచ్చిన లారీని అడ్డుకున్నారు. వెంటనే అటవీ సిబ్బంది దుమ్ముగూడెం సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన సీఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి గిరిజన మహిళా రైతులతో మాట్లాడారు. అటవీ భూముల్లో నాటే హరి మొక్కలను అడ్డు కోవద్దని, ప్రభుత్వ నిబందనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని వారికి సర్ది చెప్పారు. ఆ సమయంలో అటవీ సిబ్బంది కొంత మంది గిరిజన మహిళా రైతులను బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపులో ఎక్కించారు. కాగా పోలీసుల పహారా నడుమ కంపార్ట్ మెంట్ 125లో అటవీ సిబ్బంది హరిత మొక్కలను నాటారు. అక్కడ ఉన్న పోడు గిరిజన మహిళా రైతులు సైతం చేసేది లేక చూస్తూ ఉండి పోయారు.
పోడు సాగు దారులకు అండగా ఉంటానన్న ప్రజా ప్రతినిధులు ఎక్కడ
అటవీ సిబ్బందికి, గిరిజనులకు మద్య వివాదస్పదంగా ఉన్న పోడు వివాదాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు తోగ్గూడెం అటవీ ప్రాంతంలో పర్యటించి గిరిజన పోడు సాగుదారుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి సమ స్యను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
అదే సమయంలో అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, చింత గుప్పలో పర్యటించి పోడు రైతులకు అండగా ఉంటానని తెలిపారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య సైతం పైడిగూడెం, చింతగుప్ప గ్రామాల్లో పర్యటించి పోడు సాగుదారులను ఇబ్బందులకు గురి చేయ వద్దని అటవీ సిబ్బందికి సూచించడంతో పాటు పోడు సాగుదారులతో కలసి అటవీ శాఖ ఉన్నతాధికా రులకు వినతులు సైతం అందజేశారు. దీంతో పాటు స్థానికంగా తాము ఎన్నుకున్న సర్పంచ్లు సైతం తమకు అండగా ఉండడం లేదని వారిపై పోడు సాగుదారులు అగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. అండగా ఉంటామని చెప్పిన ప్రజా ప్రతిని ధులు ఎక్కడ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పట ికైనా పోడు సాగు దారులకు అండగా ఉంటామని చెప్పిన ప్రజా ప్రతినిధులు పోడు కొట్టి సాగు చేసు కుంటున్న తమ భూములకు హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.