Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల కేంద్రంలో సీ హెచ్సీ నిర్మాణం జరిగే దాకా పోరాటం ఆగదు
నవతెలంగాణ-చర్ల
సీపీఐ(ఎం) నిర్వహించిన రిలే నిరాహార దీక్షల ఫలితంగానే ఉన్నతాధికారులు నూతన వైద్యురాలిని నియమించడం జరిగిందని, అదేవిధంగా చర్ల మండల కేంద్రంలో సీహెచ్సీ ఏర్పాటు చేసే దాకా తమ పోరాటం ఆగదని మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక వైద్యశాలను పార్టీ బృందం సందర్శించి మోతుకూరి సుమకు అభినందనలు తెలిపి అనంతరం ఆయన మాట్లాడారు. దశాబ్దాల కాలంగా మండల కేంద్రంలో సేవలందించిన ప్రభుత్వ వైద్యశాలను నిర్లక్ష్యంగా వ్యవహరించి మూసివేయడానికి యత్నించిన క్రమంలో సీపీఐ(ఎం) సుమారు 10 రోజులపాటు వివిధ ప్రజా సంఘాలు, అఖిలపక్షం ప్రజల సహాయ సహకారాలతో రిలే నిరాహార దీక్షలు చేపట్టా మన్నారు. ఉన్నతాధికారులు సమస్యను గుర్తించి నూతన వైద్య అధికారిని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. కామ్రేడ్ సుజాత జీవిత ఆశయం నెరవేరిందని ఆమె కుమార్తె సుమా డాక్టర్ అవ్వాలన్న కోరిక నెరవేరిందన్నారు. వైద్య అధికారిని ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని వెంటనే సరిపోయినంత సిబ్బందిని నియమించి చర్ల ప్రాథమిక వైద్యశాలకు పూర్వవైభవం తీసుకు రావాలని ఆయన సూచించారు. వైద్యురాలు సుమతో మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించి పలువురి మన్ననలు పొందాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి, కొండాచరణ్, భోళ్ళ వినోద్, మచ్చా రామారావు, శ్యామల వెంకటేశ్వర్లు, పొనుపుగంటి సమ్మక్క, బంద్యల చంటి, ప్రభాకర్ రావు, వార్డు సభ్యులు దొడ్డి హరి నాగ వర్మ, శిరోని తదితరులు పాల్గొన్నారు.1