Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్. అరుణ్ కుమార్,
- జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
అమెరికన్ సామ్రాజ్యవాదం అవకాశవాద విధానంమే ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభానికి కారణమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్. అరుణ్ కుమార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు విశ్లేషణ అనే అంశంపై శుక్రవారం వెబ్నార్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ విక్రమ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ లో శాంతిని స్థాపిస్తారు అనే పేరుతో అమెరికా తన సైన్యంతో ఆఫ్ఘనిస్థాన్లో గత 20 సంవత్సరాలుగా తిష్ట వేసిందన్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి తమకు అనుకూలమైన వ్యక్తిని దేశాధ్యక్షుడిగా నియమించిందని తెలిపారు. దాని ద్వారా మిగిలిన దేశాలపై అమెరికన్ సామ్రాజ్యవాదం తమ ఆధిపత్యాన్ని చెలాయించిందని గుర్తు చేశారు. అక్కడ ఉగ్రవాదాన్ని అరికట్ట పోగా ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లకు అప్పజెప్పి అమెరికా తన ప్రయోజనాలను చూసుకుందన్నారు. మరోసారి ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలతో అమెరికా అవకాశవాద విధానం బట్టబయలైందన్నారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం సుమారు 70 ఘటనల్లో అమెరికా జోక్యం చేసుకుని మారణహౌమం సష్టించిందన్నారు. వియత్నాం, చిలీ, ఇరాక్, క్యూబా, లిబియా, లెబనాన్ ఇంకా అనేక చోట్ల లక్షలమంది ప్రాణాలను హరించిందన్నీ తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన ప్రభుత్వాలను సైతం కూల్చివేసిందని ,. 1978లో ఆఫ్ఘన్లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని. ఇదే సామ్రాజ్యవాద అమెరికాకు కంటగింపుగా మారి, నజీబుల్లా నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేయటంకోసం సర్వశక్తులు ఒడ్డిందన్నారు. మనదేశంలోనూ గుత్త పెట్టుబడి దారులు తమ దోపిడీ పాలన కొనసాగించటం కోసం మతతత్వ శక్తులకు అధికారం కట్టబెడితే పరిణామాలు ఎంత ఆందోళనకరంగా ఉంటాయో మనం చూస్తున్నామని. ఆఫ్ఘన్ పరిణామాలూ అటువంటి పాఠాన్నే మనకు నేర్పుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా నాయకులు ఎస్. నవీన్ రెడ్డి పాల్గొన్నారు.