Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర 183వ బ్రిలియంట్ ట్రోఫీ చెస్ జూనియర్ టైటిల్ ని సాధించిన ఖమ్మం త్రివేణి స్కూల్‌కు చెందిన సిహెచ్ బిశ్వజిత్ కృష్ణను ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అభినందించారు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర చెస్ బ్రిలియంట్ ట్రోఫీ టోర్నమెంట్లో 12 రౌండ్ల గాను 11.5 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని సాధించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 112 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బిశ్వజిత్ కృష్ణను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్రానికి మరియు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. చదరంగంలో మంచి కోచింగ్ ఇస్తూ పథకాలు సాధించడంతో కీలక పాత్ర పోషిస్తున్న సీహెచ్ గోపికృష్ణ జోత్స్న చెస్ కోచ్‌లను అభినందించారు.
చెస్ గేమ్స్ కోసం త్రివేణి స్కూల్ అందిస్తున్నటువంటి సహకారాన్ని ఎంకరేజ్‌మెంట్‌ను స్కూల్ యాజమాన్యాన్ని ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. ప్రతి ఒక్క విద్యార్థి చెస్ నేర్చుకోవడంలో వారి భవిష్యత్‌కి మంచి ఉపయోగాలు జరుగుతాయని తెలిపారు. త్రివేణి ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గతంలో బిశ్వజిత్ కృష్ణ అనేక పథకాలు సాధించారు. ఇప్పుడు స్టేట్ ఫస్ట్ రావడం సంతోషం వ్యక్తం చేస్తూ అందుకు బిశ్వజిత్ కు అభినందనలు తెలిపారు. త్రివేణి స్కూల్ డైరెక్టర్ శ్రీ వీరేంద్ర చౌదరి భవిష్యత్తులో బిశ్వజిత్‌కు కావలసినటువంటి చెస్ క్రీడకు సంబంధించినటువంటి ప్రోత్సాహాలు చేస్తామని తెలిపారు. బిశ్వజిత్ ను మరియు కోచ్ గోపి కృష్ణకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. బిశ్వజిత్ కష్ణకు స్కూల్ సీఆర్ఓ మురళీకృష్ణ, త్రివేణి స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలిపారు.