Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ:ఖమ్మం రూరల్
ఎస్ఎఫ్ఐ-డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నివారించేందుకు ఖమ్మం రూరల్ పోలీసులు శుక్రవారం మండలంలోని డివైఎఫ్ఐ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు జక్కంపూడి కృష్ణ, తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. కెసిఆర్ నియంత పాలన మానుకోవాలని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. అరెస్టయినవారిలో డీవైఎఫ్ఐ మండల నాయకులు గుడిబోయిన అరవింద్, సిరికొండ నగేష్, గజ్జి పట్టాభి, బోడ పట్ల శ్రీను, బోడ పట్ల నరేష్ ఉన్నారు.
డీవైఎఫ్ఐ నాయకుల అరెస్టు అక్రమం-సీపీఎం
ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ-డీవైఎఫ్ఐ నాయకులను అక్రమ పద్ధతిలో అరెస్టు చేయడం దారుణమని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకట రమణ అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని కాచిరాజుగుడెంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటరమణ మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ-డీవైఎఫ్ఐ నాయకులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కారుమంచి గురవయ్య, పొన్నం మురళి, చాంద్ పాషా, హరి, భాస్కర్, వెంకన్న, సాయి పాల్గొన్నారు.
నేలకొండపల్లి : అర్ధరాత్రి డీవైఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు కణతాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులలో ఉద్యోగాల భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగం చేయడం కెసిఆర్ నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందన్నారు. అర్ధరాత్రి అరెస్టయినవారిలో డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి రాసాల నవీన్, మధు తదితరులు ఉన్నారు.