Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతుల సంక్షేమమే సంస్థ లక్ష్యం
అ ఆయిల్ ఫెడ్ చైర్మెన్ రామకృష్ణరెడ్డి
అ సాగుపై రైతుల్లో ఆసక్తి : ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ-అశ్వారావుపేట
తెలంగాణ వ్యాప్తంగా పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్న అన్ని ప్రాంతాలలో సాగు విస్తీర్ణం పెంచాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకుపోతున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ రామకృష్ణరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నారంవారిగూడెంలో గల ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయ ప్రాంగణంలోని కేంద్రీయ నర్సరిలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఆయన అర్హులైన రైతులకు పామాయిల్ మొక్కలు పంపీణీ చేసి, మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెలకు ఉన్న అవసరం దృష్టిలో పెట్టుకోని ముఖ్యమంత్రి పామాయిల్ సాగుపై ప్రత్యేక శ్రద్ధపెట్టి రైతులకు ప్రోత్సహకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో పామాయిల్ టన్ను గెలలు ధర రూ.20 వేలు పలికే అవకాశం ఉందన్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ విస్తరణ చేపట్టేందుకు దృష్టి సారించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడ పామాయిల్ సాగు ప్రొత్సాహాకానికి రూ.11,040 కోట్లు కేటాయించిందన్నారు.
రాయితీలతోనే రైతులకు పామాయిల్ పై ఆసక్తి : ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు వల్ల రైతులు పామాయిల్ సాగుపై ఆసక్తి చూసుతున్నారు. నియోజకవర్గంలో ఆయిల్ ఫాం విస్తరణపై కేసీఆర్ కితాబు ఇచ్చారని ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను, ప్రోత్సాహకాలను రైతులు సద్వినియేగం చేసుకోని పామాయిల్ సాగు విస్తరణ పెంపుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆలపాటి రామచంద్రప్రసాద్, వెంకటేశ్వరరావు, రైతు సమన్వయసమితి కన్వీనర్ రమేష్, ఎంపీపీ శ్రీరామ్మూర్తి, సీతారామస్వామి, మలిరెడ్డి పూర్ణచంద్రరెడ్డి, రామ్మోహనరావు, చెన్నాకేశవరావు, కె.పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.