Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని సీఎస్పీ గ్రామపంచాయతీ పరిధిలోని రాజు నగర్ తండా వాసులు బురదగా ఉన్నా రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వ్యాకాస జిల్లా నేత అబ్దుల్ మాట్లాడారు. దశాబ్దాలుగా తండాలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదన్నారు. దీంతో వర్షం వస్తే బురదమయంగా తయారవుతున్నాయన్నారు. ఎండీఓ, సర్పంచులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాందాస్, లలిత, గ్రామస్తులు బాబుమియా, రమణ, కల్యాణి, రాంబాయి, జమీల బేగం, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.