Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు
నవతెలంగాణ- సత్తుపల్లి
రాజీవ్‌గాంధీ ప్రధానిగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని, ఆయన సేవలు దేశ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతాయని పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 77వ జయంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్‌రాజు, శివా వేణు మాట్లాడారు. అతి చిన్న వయసులోనే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేయడంతో పాటు టెలికాం, రక్షణ, వాణిజ్య, విమాన రంగాలను అభివృద్ధి చేశారన్నారు. 18 యేండ్లకే ఓటుహక్కు కల్పించారన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోళ్ల అప్పారావు, హలావత్ వెంకటేశ్వరరావు, కాలం కృష్ణ, జగదీశ్‌బాబు, రహ్మతుల్లా, రాయల కోటేశ్వరరావు, పూచి గోవర్దన్, ఆదినారాయణ, రాజేశ్, కాంతారావు, హరినాధ్, అర్జునరావు, ప్రసాదరావు, శ్రీనివాసరావు, రామ్మోహనరెడ్డి, హరిప్రసాదరెడ్డి పాల్గొన్నారు.
మధిర : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్ట్ అధ్యక్షుడు సూరంసెట్టి కిశోర్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దారా బాలరాజు, మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్, మునూగోటి వెంకటేశ్వర్లు, ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ అలీ, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ జహంగీర్, పట్టణ ఐఎన్టియుసీ అధ్యక్షులు ఎస్ కే బాజీ పాల్గొన్నారు.
వైరా టౌన్ : వైరా నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు పమ్మి అశోక్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం వైరా రింగు రోడ్డు సెంటరులో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, శీలం వెంకట నర్సిరెడ్డి, దొడ్డ పుల్లయ్య, పాలేటి నరసింహారావు, పువ్వాళ్ళ రాము, బొళ్ళ గంగారావు, పల్లపు కొండలరావు, రాము పాల్గొన్నారు.
ఎరుపాలెం : రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. చిత్రపటానికి పూల మాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మామునూరు గ్రామపంచాయతీ సర్పంచ్ మోహన్ రావు, ఎర్రుపాలెం సొసైటీ ఉపాధ్యక్షులు కడియం శ్రీనివాస రావు, శీలం నర్సి రెడ్డి, కంచర్ల వెంకట నరసయ్య, ఎస్ కె ఇస్మాయిల్, దేవరకొండ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
ఖమ్మం : నగరంలోని సంజీవరెడ్డి భవన్లో మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత రాజీవ్ గాంధీ చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాడ దుర్గా ప్రసాద్, రాష్ట్ర దళిత, గిరిజన, ఆత్మ దండోర కో-ఆర్డినేటర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు యం.డి. జావీద్ గ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ భారత ప్రధాన మంత్రిగాను, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగాను పనిచేసి, అటు ప్రభుత్వములోను ఇటు కాంగ్రెస్‌లోను, విప్లవాత్మక మార్పులు చేసిన మహౌన్నత వ్యక్తి అని అన్నారు.
అనంతరం మయూరి సెంటర్ లో, వర్తక సంఘం, 3టౌన్ ఏరియాలో, సెయింట్ జోసఫ్ స్కూల్, ప్రభాత్ టాకీస్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, మలినేని మంజుల. మాజీ కార్పొరేటర్లు నాగండ్ల, దీపక్ చౌదరి, యర్రం బాలగంగాధర్ తిలక్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బెల సౌజన్య, జిల్లా వీయన్టీయూసీ అధ్యక్షులు కొత్త సీతారాములు, జిల్లా ఒ.బి.సి. సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా యస్.సి.సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ పాల్గొన్నారు.